iswarya menon| చూస్తే మ‌తిపోవాల్సిందే..

iswarya menon| చూస్తే మ‌తిపోవాల్సిందే..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐశ్వర్యా మీనన్ తమిళం, తెలుగు, కన్నడ, మరియు మలయాళ సినిమాలలో న‌టించి ప్ర‌త్యేక గుర్తింపును పొందింది. ఆమె 2021లో తమిళ చిత్రం కాదలిల్ సోదప్పువదు యెప్పడిలో తొలిసారిగా నటించింది. ఆమె నాన్ సిరితాల్, తమిళ్ పదం 2, మరియు వెజం (2022) వంటి చిత్రాలలో సహాయ పాత్రలతో విస్తృత గుర్తింపు పొందింది. NIA ఏజెంట్ వైష్ణవిగా స్పై (2023) మరియు భజే వాయు వేగమ్ (2024) ఆమె న‌టించింది.

తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ జోడిగా స్పై చిత్రంతో అరంగేట్రం చేసిన నటి ఐశ్వర్య మీనన్‌కు యూత్‌లో మంచి క్రేజ్ లభించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమెకు పెద్దగా బ్రేక్ రాలేదు. ఆ తర్వాత కొంత విరామం తీసుకున్న ఆమె, భజే వాయు వేగం సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రమూ నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తరచూ కొత్త ఫోటోలు, అప్‌డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె మోడ్రన్ డ్రెస్సులు, చీరకట్టులో చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది.