Tragic incident | అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు…

Tragic incident | అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు…
Tragic incident |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ సమీపంలోని రామప్ప గుట్ట వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో స్థానికంగా విషాదం నెలకొంద
మృతులను సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన హరిచరణ్ గౌడ్ (18), ఛీర్లవంచ ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన మణికంఠ (17)గా పోలీసులు గుర్తించారు. ఈతకు వెళ్లిన యువకులు తిరిగి కనిపించకపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
