సత్తుపల్లి జేవిఆర్ ఓసి లో ప్రమాదం..

సత్తుపల్లి జేవిఆర్ ఓసి లో ప్రమాదం..
- బొలెరో కార్ ను ఢీకొన్న డంపర్..
- బొలెరో డ్రైవర్ కు తీవ్ర గాయాలు.
సత్తుపల్లి, ఆంధ్రప్రభ : సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC)లో సోమవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. రివర్స్ చేస్తున్న డంపర్ వాహనం ఒకటి మేనేజర్ ప్రయాణిస్తున్న బొలెరో కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో బొలెరో వాహనం పూర్తిగా దెబ్బతినగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు క్షతగాత్రుడిని సింగరేణి డిస్పెన్సరీకి తరలించారు.
అదేవిధంగా సంఘటన కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై వెల్ఫేర్ ఆఫీసర్ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. ఫోటోలు తీయకుండా అడ్డుకున్నారని మీడియా ప్రతినిధులు తెలిపారు.
