16 matches | ఐపీఎల్ 2026లో వైభవ్ విధ్వంసం
16 matches | ఐపీఎల్ 2026లో వైభవ్ విధ్వంసం
16 matches | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అదరగొట్టాడు. పరుగుల వరద పారించడంతో అతనికి అవార్డులన్నీ దాసోహం అన్నాయి. ఈ ఏడాది రాజస్థాన్ జట్టు తరఫున ఆడిన వైభవ్ సిక్సర్ల మోత మోగించి రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ 2026 బ్యాటింగ్ అవార్డులన్నీ సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2026 మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌తో పాటు అన్ని బ్యాటింగ్ అవార్డులన్నీ వైభవ్‌కే దక్కాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌లు ఆడి 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. 63 ఫోర్లతో పాటు 72 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును చెరిపేశాడు.
బుడ్డోడికి వచ్చిన అవార్డులు
- 436.5 పాయింట్స్‌తో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
- 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
- 72 సిక్సర్లతో సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచాడు.
- 237.31 స్ట్రయిక్ రేట్‌తో సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచాడు.
- అదేవిధంగా చివరిదైన ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా వైభవ్ సూర్యవంశీకే దక్కడం విశేషం.
