Rs. 70 lakh | గరుడాచలం.. మహనీయుడు (ఏపీ)

Rs. 70 lakh | గరుడాచలం.. మహనీయుడు (ఏపీ)
- ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు
Rs. 70 lakh | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : మహనీయుడు పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం స్థలం అద్భుత సుందరీకరణ చేసి జీవం పోస్తానని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు నరేంద్ర వర్మ రాజు తెలిపారు. పట్టణంలోని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం ఆవరణలో ఉన్న స్థలాన్ని ఎమ్మెల్యే(MLA) పరిశీలించారు. అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలపై అధికారులతో సత్రం కమిటీతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాపట్ల పరిసర ప్రాంతాలలో మహనీయుడు పేరం గరుడాచలం నాయుడు వందల ఎకరాలను పేదల కోసం దానం చేశారని, ఆయన జ్ఞాపకార్థం తూర్పు సత్రం స్థలాన్ని అన్నిరంగులతో అభివృద్ధి(Development) చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న కమిటీతో పాటు తూర్పు సత్రం నిర్వహణ కోసం మరొక తొమ్మిది మందితో కూడిన ప్రత్యేక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. స్థలంలో క్రమబద్ధమైన షాపుల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు.
ప్రజల కోసం అత్యాధునికమైన సింథటిక్ వాకింగ్ ట్రాక్(synthetic walking track), అద్భుతమైన పార్క్(Park) ఏర్పాటు చేస్తామన్నారు. పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం పేరుతో పట్టణంలోనే ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణాభివృద్ధికి భూములు దానం చేసిన గొప్ప వ్యక్తులు ఆశయాలను గౌరవిస్తూ.. ఆయా ఆస్తులను పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడం మా బాధ్యత అని ఎమ్మెల్యే చెప్పారు.
రూ. 70 లక్షల(Rs. 70 lakh) వ్యయంతో కర్మకాండలు చేయడానికి పురాణ కాలక్షేప మండపం నిర్మిస్తున్నామని, త్వరలో దానిని పూర్తిచేసి ప్రారంభిస్తామని తెలియజేశారు. ఆక్రమణలకు తావు లేకుండా పారదర్శకమైన కమిటీల ద్వారా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తెదేపా పట్టణ అధ్యక్షుడు బలపల శ్రీనివాసరావు, సత్రం కమిటీ చైర్మన్ తులసి కుమారి, జనసేన నాయకులు విన్నకోట సురేష్, కారుమూరి ఆంజినేష్ నాయుడు, సత్రం కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
