అకాల వర్షాలకు నష్టపోయిన వారికి పరిహారం..

అకాల వర్షాలకు నష్టపోయిన వారికి పరిహారం..

  • తడిసిన ధాన్యం, మక్కజోన్నలు కొనుగోలు చేస్తాం..
  • రాష్ర్ట సంక్షేమశాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ధర్మారం, ఆంధ్రప్రభ : ఇసుక దందాలో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని రాష్ర్ట సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కురిసిన ఆకాల వర్షాలకు జరిగిన నష్టాన్ని మంత్రి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై ఏలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వకాలంలో జోరుగా ఇసుక దందాసాగిందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరేళ్ల గ్రామం నుంచి మానేరు ఇసుకను రోజు వందల లారీల్లో రవాణ చేసే వారని మంత్రి అన్నారు. అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న క్రమంలో పలువురు లారీల కింద పడి మరణించారని మంత్రి అడ్లూరి గుర్తు చేశారు. నేరేళ్ల దళితులు అక్రమ ఇసుక రవాణపై అందోళన చేస్తే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులపై థర్డ డిగ్రీ ఉపయోగించిందని మంత్రి అడ్లూరి అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో దళితులపై జరిగిన దాడులపై మాట్లాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంలో ఇసుక దందాలో తనకు వాట ఉందని మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి అన్నారు. ఇసుక దందాలో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్దమని మంత్రి అడ్లూరి అన్నారు. మాజీ మంత్రి కొప్పుల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మంత్రి అడ్లూరి హితవు పిలికారు.

తడిసినవడ్లు, మక్క జోన్నలు కొనుగోలు చేస్తాం..

ధర్మరం మండలంలో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యం, మక్కజోన్నలు కొనుగోలు చేస్తామని మంత్రి అడ్లూరి అన్నారు. రైతులు ఎవ్వరు అందోళన చెందవద్దని మంత్రి కోరారు. ఆకాల వర్షానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరంగా అదుకుంటామని మంత్రి అడ్లూరి తెలిపారు.