Liquor Scam Case | జగన్ మాజీ పీఏను ప్రశ్నిస్తున్న సిట్‌

Liquor Scam Case | జగన్ మాజీ పీఏను ప్రశ్నిస్తున్న సిట్‌

Liquor Scam Case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం ముడుపుల కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) కేఎన్‌ఆర్‌ను సిట్‌ అధికారులు మరోసారి విచారిస్తున్నారు. సిట్‌ ఆదేశాల మేరకు ఆయన సోమవారం విజయవాడలోని సిట్‌ కార్యాలయానికి హాజరయ్యారు.

కేఎన్‌ఆర్‌ను అధికారులు పలు అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రెండు రోజుల పాటు ఆయనను విచారించిన సిట్‌ అధికారులు, ఆర్థిక లావాదేవీలు, అనుబంధ వ్యక్తుల వివరాలపై కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరోసారి విచారణ చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా వైకాపా అధికార ప్రతినిధి శివశంకర్‌రెడ్డిని కేఎన్‌ఆర్‌కు బినామీగా గుర్తించినట్లు సమాచారం. అలాగే కేఎన్‌ఆర్‌కు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, వాటి మూలాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలపై ప్రశ్నలు సంధిస్తున్న సిట్‌, మరికొంతమందిని కూడా విచారణకు పిలిచే అవకాశమున్నట్లు సమాచారం.

Leave a Reply