కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి, ఆంధ్రప్రభ:
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావును ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను ఆప్యాయంగా పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న చింతా ప్రభాకర్ సేవలను కేసీఆర్ అభినందించినట్లు సమాచారం.
రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించినట్లు పేర్కొన్నారు. ఈ భేటీలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ కొత్తకాపు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
