నూతన డీఈఓను కలిసిన బీఆర్ఎస్వీ నాయకులు..
సంగారెడ్డి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు స్వీకరించిన రోహిణిని బీఆర్ఎస్వీ నాయకుడు అఖిల్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్యా సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అఖిల్ కోరారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విద్యాశాఖ అధికారులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం డీఈఓ చొరవ తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల విక్రమ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
