ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనంత కిషన్ గుప్తా

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనంత కిషన్ గుప్తా

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ:

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోపాజి అనంత కిషన్ గుప్తా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల నాయకులు, సభ్యులు తోపాజి అనంత కిషన్ గుప్తాను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం గతంలో చేపట్టిన కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఆర్యవైశ్య సమాజ ఐక్యత, యువత ప్రోత్సాహం, విద్య, సామాజిక సేవా కార్యక్రమాల బలోపేతానికి కట్టుబడి పనిచేస్తానని తోపాజి అనంత కిషన్ గుప్తా తెలిపారు. తనపై మరోసారి విశ్వాసం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన మహాసభ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply