వైరా మున్సిపాలిటీకి కొత్త బాస్.. ఆర్డర్స్ జారీ

వైరా మున్సిపాలిటీకి కొత్త బాస్.. ఆర్డర్స్ జారీ
వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపల్ కొత్త కమిషనర్‌గా ఎం. రామచంద్రరావు నియమితులయ్యారు. ఆ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ అండ్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ త్రిల్లేశ్వరరావు ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎం. రామచంద్రరావు కూసుమంచి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన తర్వాత, కల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా, అలాగే ఎన్నికల సమయంలో సూర్యపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్‌గా సేవలందించారు. ఇప్పుడు ఆయన వైరా మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
