కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి గొంతు కోసింది

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి గొంతు కోసింది

  • ఎమ్మెల్యే అనిల్ జాధవ్

తాంసి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి గొంతు కోసిందని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ విమర్శించారు. జొన్న రైతుల ఇబ్బందులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి శనివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తాంసి మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడం, తూకం ప్రక్రియలో జాప్యం, గన్నీ సంచుల కొరత, చెల్లింపుల ఆలస్యం, అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంట నీటి పాలవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి రైతులకు న్యాయం చేయకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కుతామని హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో అధికారులు మండల వ్యవసాయ అధికారి రవీందర్, సీఈఓ శ్రీనివాస్, మార్కుఫెడ్ అధికారులు,బి ఆర్ ఎస్ మాజీ మండల కన్వీనర్ మండల కృష్ణ,మాజీ ఎంపీపీ రఘు, వెంకట్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply