అర్ధరాత్రి నుండే అమాత్యుడి జన్మదిన వేడుకలు

అర్ధరాత్రి నుండే అమాత్యుడి జన్మదిన వేడుకలు

  • ఆకాశాన్ని అంటిన కార్యకర్తల అభిమానం
  • అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు

మంథని, ఆంధ్రప్రభ : మంత్రి శ్రీధర్ బాబు పైన కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులకు ఉన్నటువంటి ప్రేమ అభిమానం జన్మదిన వేడుకలలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అమాత్యుడి జన్మదిన వేడుకలు అర్ధరాత్రి నుండే ప్రారంభమయ్యాయి. మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన పురస్కరించుకొని శుక్రవారం అర్ధరాత్రి మంథని అంబేద్కర్ చౌరస్తాలో మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ మంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

మంథని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు మరింత సేవలు అందిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్, నాయకులు ఉప్పట్ల శ్రీను, మంథని సత్యం, సర్పంచ్ రామస్వామి, యువ నాయకులు శ్రీకాంత్, ప్రవీణ్, ఇందారపు అనిల్, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply