మంగపేటలో వరుస చోరీ కేసులు ఛేదించిన పోలీసులు..

మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో జరిగిన పలు చోరీ కేసులను ఛేదించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, మంగపేట ఎస్సై టి.వి.ఆర్.సూరి, సెకెండ్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం మంగపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, మంగపేట ఎస్సై టి.వి.ఆర్.సూరి, సెకెండ్ ఎస్సై శ్రీకాంత్ లు మాట్లాడుతూ.. మంగపేట మండలంలోని గంపోనిగూడెం, కమలాపురం, బోరు నర్సాపురం గ్రామాలలో జరిగిన పలు చోరీ కేసులలో దర్యాప్తు చేసి కమలాపురంకు చెందిన నిమ్మల వినయ్ కుమార్, పరమాత్ముల శివ, బోయి పరశురాం, రాయరాకుల సారయ్య, నిమ్మల కుమార్, భూక్య ప్రవీణ్, ఏటూరునాగారం మండలం, చిన్నబోయినపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న కమలాపురంకు చెందిన మహ్మద్ బిజిగిరి, కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బండి తరుణ్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

వీరిలో ప్రధాన నిందితులపై గతంలో కూడా పలు దొంగతనం కేసులు నమోదయి ఉన్నాయని, పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. నిందితులు మంగపేట, కొత్తగూడెం, నిజామాబాద్ తదితర ప్రాంతాలలో పలు దొంగతనాలకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నట్లు సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై టి.వి.ఆర్.సూరి, సెకెండ్ ఎస్సై శ్రీకాంత్ లు తెలిపారు. నిందుతుల నుండి ఒకటిన్నర తులాల బంగారం, 40 తులాల వెండి వస్తువులు, మూడు మోటార్ సైకిళ్ళు ,10 వేల రూపాయల నగదు , 3 సెల్ ఫోన్లు, 30 కేజీల కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును సమర్థంగా ఛేదించినందుకు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ లు సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై టి.వి.ఆర్.సూరి, సెకెండ్ ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుళ్లు మోహన్, రమేష్, ప్రసాద్, నరేష్, మోహన్ తదితరులను అభినందించారు.