టిఫిన్ సెంటర్‌పై వ్యక్తి దాడి.. అద్దం ధ్వంసం

టిఫిన్ సెంటర్‌పై వ్యక్తి దాడి.. అద్దం ధ్వంసం
ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో రాజు టిఫిన్ సెంటర్‌పై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి రాయితో దాడి చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ దాడిలో టిఫిన్ సెంటర్ అద్దం ధ్వంసమైంది.
టిఫిన్ సెంటర్ యజమాని రాజు తెలిపిన వివరాల ప్రకారం, మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి టిఫిన్ సెంటర్‌కు వచ్చి టిఫిన్ అడిగాడు. రెండు నిమిషాలు ఆగాలని చెప్పడంతో ఆ వ్యక్తి దుర్భాషలాడుతూ దుకాణంపై రాయితో దాడి చేశాడని రాజు తెలిపారు. దాడిలో టిఫిన్ సెంటర్ అద్దం పగిలిపోయిందని పేర్కొన్నారు. ఈ విషయమై టిఫిన్ సెంటర్ యజమాని ఎడపల్లి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి ఘటనలు సామాన్య ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
