నిశితలో జాబ్ మేళా
నిశితలో జాబ్ మేళా
నిజామాబాద్ , ఆంధ్రప్రభ : నగరంలోని నిశిత డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. తృతీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని ఈ డ్రైవ్ లో అన్ని గ్రూపులకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారనీ నిశిత కళాశాల చైర్మన్ రాజు తెలిపారు. టెక్ మహేంద్ర లైరోస్ , సాగిల్టి, డిజిటైర్డ్, స్టార్ టెక్, జస్ట్ డయాల్, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల నైపుణ్యాన్ని బట్టి వివిధ కంపెనీలకు ఎంపిక చేశారని తెలిపారు .
ఈ డ్రైవ్ లో 230కి పైగా విద్యార్థులు పాల్గొనగా 110 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలను అందజేయడం జరిగిందని, డ్రైవ్ నిర్వహించిన కంపెనీ ప్రతినిధులకు కళాశాల యజమాన్యం ధన్యవాదాలు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు నిశిత కళాశాల యజమాన్యం ప్రొఫెసర్ సాయిలు, విభాగ సమన్వయకర్త ప్లేస్మెంట్ ఆఫీసర్ కె. మునంద, అధ్యాపక బృందం విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వప్న, మేనేజింగ్ డైరెక్టర్ షేక్ , సాయిలు, ఆధ్యాపక బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
