మంథని–చంద్రపూర్ బస్సు సర్వీస్ పునరుద్ధరణ

మంథని–చంద్రపూర్ బస్సు సర్వీస్ పునరుద్ధరణ

మంథని, ఆంధ్రప్రభ: మంథని–చంద్రపూర్ బస్సు సర్వీస్‌ను పునరుద్ధరించనున్నట్లు డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.మొదటి సర్వీస్ మంథని నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, రాజుర మీదుగా మధ్యాహ్నం 2.45 గంటలకు చంద్రపూర్ చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తిరిగి చంద్రపూర్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు మంథని చేరుకుంటుందని తెలిపారు.

రెండో సర్వీస్ మంథని నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లికి వెళ్తుందని చెప్పారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మంథని, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, రాజుర మీదుగా రాత్రి 8.30 గంటలకు చంద్రపూర్ చేరుకుంటుందని వివరించారు.చంద్రపూర్ నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు మంథని చేరుకుంటుందని డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని శ్రావణ్ కుమార్ కోరారు.

Leave a Reply