ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం

ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అశోక్ నగర్ 18వ వార్డు ప్రాంతానికి చెందిన జనగాం భాస్కర్ (32) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ మొబైల్ షాప్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న భాస్కర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

భాస్కర్ మృతి విషయం తెలుసుకున్న ఆయన పనిచేసిన మొబైల్ షాప్ యాజమాన్యం సిరి ఫౌండేషన్‌ను సంప్రదించి ఆర్థిక సాయం కోరింది. వెంటనే స్పందించిన సిరి ఫౌండేషన్, దాతల సహకారంతో రూ.10,000 ఆర్థిక సహాయాన్ని సేకరించి కుటుంబ సభ్యులకు అందజేసింది.

ఈ కార్యక్రమంలో సిరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సరిగమల తిరుపతి, అధ్యక్షుడు కడగొండ సాయి కుమార్, సభ్యులు ఉప్పు శేఖర్, సచిన్, నవీన్, రామ్‌లు భాస్కర్, అలాగే బీఆర్ఎస్ యూత్ నాయకులు రామిడి లక్ష్మికాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.