ఆధునిక భారత రూపశిల్పి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ

ఆధునిక భారత రూపశిల్పి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ
మక్తల్, ఆంధ్రప్రభ:
భారతదేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత రూపశిల్పి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారిలో మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హన్మంతు, మాజీ జెడ్పీటీసీ జి. లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కట్ట సురేష్ గుప్తా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బి. గణేష్ కుమార్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ తొలి ప్రధానమంత్రిగా పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి భారత అభివృద్ధికి నాంది పలికారని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు.
నెహ్రూ హయాంలోనే దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు పలు పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన వేసిన అభివృద్ధి పునాదులే నేడు దేశం ఆర్థికంగా ముందంజలో నిలవడానికి కారణమయ్యాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వెంకటేశ్, మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్, సాలంబిన్ ఉమర్ బస్రవి, నాగరాజ్, అంజి, కో-ఆప్షన్ సభ్యుడు వల్లంపల్లి లక్ష్మణ్, నాయకులు వాకిటి శ్యామ్, కావలి రాజేందర్, నీలగౌడ్, శంకర్, నగేష్, గోవర్ధన్, భాస్కర్, అఫ్రోజ్ పాల్గొన్నారు.
