క్రీస్తు అంటే ప్రేమ, శాంతి, క్షమించే హృదయం..

క్రీస్తు అంటే ప్రేమ, శాంతి, క్షమించే హృదయం..

బ్రదర్ డబ్ల్యూ సీ ఎం కిరణ్ పాల్

కేసముద్రం, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: క్రీస్తు అంటే ప్రేమ, శాంతి, క్షమించే హృదయం అని బ్రదర్ డబ్ల్యూ సీ ఎం కిరణ్ పాల్ గుడివాడ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని హరిహర గార్డెన్‌లో క్రీస్తు శాంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిరణ్ పాల్ క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడారు. యేసుక్రీస్తును అనుసరించే ప్రతి ఒక్కరూ సమాజంలో ఇతరుల పట్ల ప్రేమను వ్యక్తపరచాలని ఆయన సూచించారు.

తమ ప్రవర్తన ద్వారా ఇతరులకు మేలు కలిగేలా జీవించాలన్నారు. క్రీస్తు సిలువ మరణం ప్రపంచానికి రక్షణ మార్గంగా మారిందని, ఆయన రక్తంలో పాపక్షమాపణ, రక్షణ ఉందని తెలిపారు. అన్ని మతాల సంస్కృతులను గౌరవించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని పి.జె.ఎఫ్ మహబూబాబాద్ బ్రదర్ లివింగ్ వాటర్ నిర్వహించగా, జాన్ మహబూబ్ అధ్యక్షత వహించారు. కేమండల పాస్టర్ ఫెలోషిప్, సిజేఏసీ, పరలోక ప్రార్థన సాహవాసం ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్, మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు వల్లందాస్ సుధాకర్, పిల్లి కుమారస్వామి, పరలోక ప్రార్థన సాహవాస అధ్యక్షులు బనిశెట్టి వెంకటేష్, ప్రభు జీవన్, రూబెన్ పాల్, ఇజ్రాయిల్, జోసెఫ్ సురేష్, పృధ్విరాజ్, విక్టరీ పాల్, లాల్ సింగ్, పుల్లెంలో శ్రీధర్, జోసెఫ్, లాజరస్ గౌడ్, మోజెస్, రాజు తదితరులు పాల్గొన్నారు.