రూ.2 లక్షల లంచం కేసు.. ఏసీబీకి చిక్కిన శామీర్‌పేట ఎమ్మార్వో సుచరిత

రూ.2 లక్షల లంచం కేసు.. ఏసీబీకి చిక్కిన శామీర్‌పేట ఎమ్మార్వో సుచరిత

శామీర్‌పేట, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: శామీర్‌పేట ఎమ్మార్వో సుచరిత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి నుంచి డ్రైవర్ ద్వారా రెండు లక్షల రూపాయలు తీసుకుని, ఆ డబ్బును ఎమ్మార్వో సుచరితకు అందిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మార్వోతో పాటు డ్రైవర్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిని విచారిస్తున్నారు.