నీటి సదుపాయాల మెరుగుదలకు మోటర్ల ఏర్పాటు

నీటి సదుపాయాల మెరుగుదలకు మోటర్ల ఏర్పాటు

వికారాబాద్, ఆంధ్రప్రభ:
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో ప్రజలకు మెరుగైన నీటి సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో లంక లక్ష్మీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పీర్లు నిలబెట్టే దుర్గా ముందు ఉన్న బోరు, చెనగల్లిలోని మరో బోరుకు మోటర్లను ఏర్పాటు చేశారు. ఈ పనుల ద్వారా స్థానికులకు తాగునీటి సరఫరా మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఆనంద్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, సల్మాన్‌తో వీరేష్ తో పాటు మున్సిపల్ సిబ్బంది సామెల్ పాల్గొన్నారు. స్థానికులు ఈ చర్యపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తున్న వార్డు నాయకత్వాన్ని అభినందించారు.

Leave a Reply