ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన..

ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన..
సమస్యల పరిష్కారానికి వేగవంత చర్యలు
భవానిపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ ప్రజల కోసం భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. రోజురోజుకూ ప్రజల ఆదరణ పెరుగుతోందని కార్యాలయ వర్గాలు తెలిపాయి.
మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి సమస్యను నిశితంగా పరిశీలిస్తూ పరిష్కార మార్గాలు సూచించారు.
పరిష్కారం కాని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ముఖ్యమంత్రి సహాయ నిధి, తాగునీరు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం వంటి అంశాలపై ప్రజలు తమ వినతులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయి, ఏపీ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ బాబు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, అధికార ప్రతినిధి గన్నవరపు శ్రీనివాసరావు, జనసేన నాయకులు ఏలూరు సాయి శరత్, శనివారపు శివ, బీజేపీ డివిజన్ అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, తెలుగు యువత నాయకులు దాడి మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
