మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి సతీమణి మృతి

మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి సతీమణి మృతి
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, జిల్లాలోని భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం సంతోష్‌రెడ్డికి సతీవియోగం కలిగింది.ఆయన సతీమణి విజయమ్మ(80) గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సోమవారం వేకువ జామున హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో కన్నుమూశారు. సంతోష్‌రెడ్డి కుమారుడు వాసుబాబు (శ్రీనివాస్‌రెడ్డి) హైదరాబాద్ లో ఉండగా, ఆయన సతీమణి, కొడుకు అమెరికా లో ఉన్నారు. వారు బుధవారం వరకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సంతోష్‌రెడ్డి స్వగ్రామం ముచ్కూర్‌లో విషాధచాయలు అలుముకున్నాయి.
