పాఠశాలలకు పుస్తకాలు అందజేత..

దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థుల సకాలంలో పుస్తకాలు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నుంచి పంపిణీ చేసిన 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వచ్చిన పాఠ్యపుస్తకాలను దండేపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో సోమవారం మండల విద్యాధికారి మంత్రి రాజు మండలంలోని 9 ఉన్నత పాఠశాలలకు, 1 కేజీబీవీ పాఠశాలకు 1మోడల్ స్కూల్, విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. జూన్ 12వ తేదీలోపు అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందజేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎమ్మార్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
