ఆయిల్ ఫామ్ పంటలతోఅధిక లాభాలు…

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; రైతులు ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేసి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నారాయణపేట జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా సూచించారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ వైతివేదిక భవనంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటలు సాగుచేయడంవల్ల దీర్ఘకాలికంగా లాభాలు వస్తాయన్నారు. సరైన పద్ధతిలో సాగు చేస్తే రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం ఈ పంటలకు ప్రోత్సహిస్తుందని అన్నారు.

ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులు సాంప్రదాయ పంటల కంటే మెరుగైన ఆదాయం పొందవచ్చనిఅన్నారు. మొక్కలు నాటడం నుండి పంట దిగుబడి వచ్చేవరకు పాటించాల్సిన శాస్త్రీయ విధానాలను ప్రతి రైతు తెలుసుకోవాలన్నారు. క్లస్టర్ ఉద్యానవన శాఖ అధికారిని సమీనా బేగం మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట సాగు నిర్వహణ భూమి ఎంపిక, నీటి నిర్వహణ ఎరువుల వినియోగం చీడ పీడల నియంత్రణ తదితర అంశాలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డి, ఏ ఈ ఓ స్వరూపరాణి, రైతులు తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply