విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం..
విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం..
కడం, ఆంధ్రప్రభ : కడం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల వెనకాల ఉన్న పోచమ్మ గుడి ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సోమవారం కడం పెద్దూర్ గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, పాలకవర్గ సభ్యులు, విద్యుత్ శాఖ అధికారులు కలిసి కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. కడం పెద్దూరులో విద్యుత్ సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తున్నందున పెద్దూరు జిపి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సిబ్బందికి ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
