జాతీయ రహదారి పై బిఆర్ఎస్ ధర్నా

చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట జాతీయరహదారి పై బి ఆర్ ఎస్ నాయకులు రైతుల తో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ జెడ్పి వైస్ చేర్మెన్ మూల రాజిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గా విఫలమైయిందని ఆరోపించారు.

రాష్ట్రమంత్రి వివేక్ నియోజక వర్గ రైతులు వరి ధాన్యం అమ్మకానికి అరిగోస పడుతున్న స్పందించడం లేదన్నారు. ఇప్పటిటికైనా ప్రభుత్వం వరి కొనుగోలులో జాప్యం జారుకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల పట్ల అవలంబిస్తున్న తీరు పై రైతులు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు ధర్నా చేస్తున్న నాయకులను తొలగించారు.

Leave a Reply