క్రీడలను ప్రోత్సహించటం అభినందనీయం

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
ఈ నెల 28న రావెళ్ల ఉదయ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్
పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : క్రీడలను ప్రోత్సహించటం అభినందనీయం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఈనెల 28వ తేదీ చల్లపల్లి మండలం లక్ష్మీపురంలోని మంగళాపురం రోడ్డులో రావెళ్ల కృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో రావెళ్ల ఫౌండేషన్ ప్రెసిడెంట్, టీడీపీ మండల నాయకులు రావెళ్ల ఉదయ్ కుమార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు పురస్కరించుకొని కృష్ణాజిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు.
ఈ మేరకు టోర్నమెంటు పోస్టర్లను ఉదయ్ కుమార్ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. టోర్నమెంట్ ఏర్పాట్లను ఎమ్మెల్యేకు వివరించారు. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు అనువైన టోర్నమెంటు నిర్వహణ చేపట్టిన ఉదయ్ కుమార్ ను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనను ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో రావెళ్ళ సేవా సమితి ప్రతినిధులు, సభ్యులు ఘనంగా సత్కరించారు.

