Rs 7.50 Hike Petrol : ఈసారీ .. భారీ వడ్డన Andhra Prabha Top News

Rs 7.50 Hike Petrol : ఈసారీ .. భారీ వడ్డన Andhra Prabha Top News

  • లీటరు పెట్రోలు.. ₹2.61
  • లీటరు డీజెలు ₹2.71
  • మొత్తం పెరుగుదల ₹7.50

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్​ )

Rs 7.50 Hike Petrol : అమెరికా యుద్ధ కాంక్షతో… మళ్లీ ఇంధనం ధరలు భగ్గుమన్నాయి. ఇక భారత దేశంలో ఆయిల్​ కంపెనీలు .. రోజు విడిచి రోజు పెట్రోలు , డీజెలు ధరలు పెంచుతున్నాయి. గత మూడు సార్లు లీటరు పెట్రోలు, డీజెలు ధర ఒక రూ‌‌పాయిలోపు పెంచిన ఆయిల్​ కంపెనీలు ఈ రోజు (మే 25, 2026, సోమవారం) దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌పై ₹2.61, లీటర్ డీజిల్‌పై ₹2.71 వంతున వడ్డించాయి. ఒకే భారీగా పెంచాయి. గత 10 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి. తెలంగాణలోని హైదరాబాద్​ లొ లీటరుకు రూ. 112.81 (మే మొదటివారంలో రూ. 107.46 గా ఉన్న ధర, ప్రస్తుతం రూ. 5.35 పెరిగింది).డీజిల్ ధర: లీటరుకు రూ. 100.94 ఇటీవలి పెంపుతో డీజిల్ ధర మొదటిసారి రూ. 100 మార్కును దాటింది . ఇక ఆంధ్రప్రదేశ్ విజయవాడ పెట్రోల్ ధర: లీటరుకు రూ. 114.72 (మే ప్రారంభంలో రూ. 109.63 గా ఉన్న ధర, ప్రస్తుతం రూ. 5.09 పెరిగింది).డీజిల్ ధర: లీటరుకు సుమారు రూ. 100.56 వరకు ఉంది.

Rs 7.50 Hike Petrol : తెలుగు రాష్ట్రాల్లో వడ్డన ఇలా

  • హైదరాబాద్: పెట్రోల్ ₹115.62 , డీజిల్ ₹103.76
    విజయవాడ: పెట్రోల్ ₹117.16 , డీజిల్ ₹104.89
    విశాఖపట్నం: పెట్రోల్ ₹116.39 , డీజిల్ ₹104.11
    తిరుపతి: పెట్రోల్ ₹117.08 , డీజిల్ ₹104.75
    ఈ నెల మే 15 నుంచి ఇప్పటివరకు జరిగిన నాలుగు పెంపులతో కలిపి, లీటర్ పెట్రోల్, డీజిల్‌లపై మొత్తంగా దాదాపు ₹7.50 వరకు భారం పెరిగింది.
  • తాజా గా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఈ విధంగా ఉన్నాయి

Leave a Reply