కేసముద్రంలో వడదెబ్బతో వృద్ధుడు మృతి

కేసముద్రంలో వడదెబ్బతో వృద్ధుడు మృతి

కేసముద్రం, ఆంధ్రప్రభ : రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రతకు తాళలేక వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని బడి తండాలో ఆదివారం చోటు చేసుకుంది. కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని బడితండా చెందిన అజ్మీర లచ్య (77) గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురయ్యాడు.

దీంతో ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు ప్రారంభం కావడంతో లచ్య శరీరం పూర్తిగా క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. అజ్మీర లచ్యకు భార్య లక్ష్మి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Leave a Reply