జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కొండేటి కళాధర్

జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కొండేటి కళాధర్
కేసముద్రం, ఆంధ్రప్రభ : తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా,ఆయన వదిలివెళ్లిన రాజకీయ వారసత్వాన్ని అంది పుచ్చుకుంటూ అడుగులు వేస్తున్నారు ఆయన తనయుడు 40 సంవత్సరాలు కన్న తల్లి లాంటి పార్టీ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన కొండేటి కళ్యాణ్ కుమార్. అనారోగ్య కారణంగా తండ్రి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయగా.. అధికారంలోకి వచ్చిన కన్నతల్లి లాంటి పార్టీని చూడలేక పోయారు తండ్రి అడుగుజాడల్లో యువ నాయకుడికి ఇప్పుడు పదవి వరించింది. పార్టీ కోసం ఆయన చూపిస్తున్న చొరవ,నిరంతరం పార్టీ కోసం కష్టపడుతున్న తీరు గుర్తించి జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమించింది.
ఈ సందర్భంగా కళాధర్ మాట్లాడుతూ… మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా నాకు అవకాశం కల్పించిన మహబూబాద్ శాసనసభ్యులు భూక్య మురళి నాయక్ కి, డిసిసి అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళి నాయక్ కి, మహబూబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ కి, యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కడి శివ చరణ్ రెడ్డికి, మహబూబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ భూక్య వెంకటేష్ నాయక్ కి,మహబూబాద్ జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ తారల వీరేష్ యాదవ్, మండల అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ గొల్లపల్లి మహేంద్ర గౌడ్ కి, ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఈసందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
