won45Runs | పట్టుదలతో సత్తా చాటిన దివ్యాంగ క్రికెటర్లు

won45Runs | పట్టుదలతో సత్తా చాటిన దివ్యాంగ క్రికెటర్లు

won45Runs | ఆసక్తిగా ఫైనల్ పోరు

won45Runs | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బెంగళూరులో జరుగుతున్న 5వ ఎలైట్ నేషనల్ ఫిజికల్ డిసేబిలిటీ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో ముంబై, ఉత్తరప్రదేశ్ జట్లు ఫైనల్‌కు చేరాయి. సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ రెండు జట్లు టైటిల్ పోరుకు సిద్ధమవ్వడంతో క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కర్ణాటక దివ్యాంగ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఫిజికల్లీ చాలెంజ్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (PCCAI) అనుబంధంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా శారీరక వైకల్యం ఉన్న క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా ఈ ఛాంపియన్‌షిప్ నిలుస్తోంది.

మొదటి సెమీఫైనల్‌లో ముంబై జట్టు మహారాష్ట్రపై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశ్ పాటిల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, రోహన్ భోయర్ బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసి జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు. మరో సెమీఫైనల్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు హర్యానాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.

ఈ టోర్నీ కేవలం క్రికెట్ పోటీ మాత్రమే కాదు.. జీవితంతో పోరాడుతున్న దివ్యాంగ క్రీడాకారుల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. శారీరక పరిమితులను అధిగమించి మైదానంలో చెమటోడ్చుతున్న ఆటగాళ్లు ఎంతో మందికి స్ఫూర్తిగా మారుతున్నారు.

దివ్యాంగ క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు భవిష్యత్తులో అండర్-19 జాతీయ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అలాగే దివ్యాంగ క్రికెటర్లకు మెరుగైన వసతులు, ఆర్థిక సహాయం అందించేందుకు బీసీసీఐని కూడా సంప్రదించనున్నట్లు తెలిపారు. బెంగళూరులోని స్పోర్ట్స్ గార్డెన్ మైదానంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

click here to read ఢిల్లీతో కోల్‌క‌తా ఢీ

click here to read more

Leave a Reply