భక్తుల కోసం సేవా చల్లదనం..

భక్తుల కోసం సేవా చల్లదనం..

భవానిపురం, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ పర్యవేక్షణలో ఆదివారం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం కెనాల్ రోడ్ దర్గా వద్ద అమ్మ భక్తులు, బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాడిత శంకర్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

వేలాది మంది అమ్మ భక్తులకు, బాటసారులకు అమ్మ సన్నిధిలో చల్లటి మజ్జిగ పంపిణీ చేయడం పుణ్యకార్యమని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసైనికుడికి అభినందనలు తెలిపారు. అమ్మవారి దీవెనలతో మరిన్ని సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

బాడిత శంకర్ మాట్లాడుతూ.. ముఖ్య అతిథిగా హాజరైన బుద్దా వెంకన్న తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి విలువలను గౌరవిస్తూ జనసైనికులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రతి జనసైనికుడికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లింగం ప్రసాద్, గౌరీ శంకర్, దొడ్ల రాజా, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply