ప్ర‌త్యేక పోటీల్లో విజేత‌ల‌కు స‌త్కారం

ప్ర‌త్యేక పోటీల్లో విజేత‌ల‌కు స‌త్కారం

ఆంధ్రప్రభ , విజయవాడ:

సోమ‌వారం అంత‌ర్జాతీయ మ్యూజియం దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించిన వివిధ పోటీల్లో విజేత‌ల‌ను ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో స‌త్క‌రించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, 20 పాయింట్ల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం, ఏపీ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి, ఏపీటీడీసీ చైర్‌పర్సన్ ఎన్. బాలాజీ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ కమిషనర్ పిసురేష్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తదితరులు పాల్గొని విజేత‌ల‌ను అభినందించారు. హెరిటేజ్ ఆన్ కాన్వాస్, వన్ ఆర్టిఫాక్ట్ వన్ స్టోరీ, మై ఫ్యామిలీ ట్రెజర్, హెరిటేజ్ క్విజ్, హెరిటేజ్ ఫోటోగ్రఫీ పోటీల్లో 28 మంది విజేతలను సత్కరించారు.

Leave a Reply