అమ్మ సన్నిధిలో సేవా కార్యక్రమం..

అమ్మ సన్నిధిలో సేవా కార్యక్రమం..

భవానిపురం, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ పర్యవేక్షణలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం కెనాల్ రోడ్ దర్గా వద్ద ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అమ్మ భక్తులు, బాటసారులకు చల్లటి మజ్జిగ అందించారు.

ఈ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాడిత శంకర్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

వేలాది మంది అమ్మ భక్తులకు, బాటసారులకు మజ్జిగ పంపిణీ చేయడం పుణ్యకార్యమని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసైనికుడికి అభినందనలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

బాడిత శంకర్ మాట్లాడుతూ.. తమ ఆహ్వానాన్ని స్వీకరించి కార్యక్రమానికి హాజరైన బుద్దా వెంకన్నకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి విలువలను గౌరవిస్తూ జనసైనికులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రతి జనసైనికుడికి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లింగం ప్రసాద్, గౌరీ శంకర్, దొడ్ల రాజా, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply