ఘనంగా టిపిసిసి అధ్యక్షులు జన్మదిన వేడుకలు

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా , టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహేష్ గౌడ్ ఆరోగ్యంతో ఉండాలి అని,ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరే దిశగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఐఎన్టీయూసీ నాయకులు, యూత్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
