TG | 15వ వార్డు అభ్యర్థి విస్తృత ప్రచారం…

TG | 15వ వార్డు అభ్యర్థి విస్తృత ప్రచారం…

TG | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 15వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం రోజు పరకాల పురపాలక సంఘం 15వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థిగా కుక్కల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి విజయ్ కుమార్ మాట్లాడుతూ వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ఆశీస్సులతో బీజేపీ పార్టీ తోనే పరకాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. అభ్యర్థి విజయ్ కుమార్ వెంట బీజేపీ నాయకులు, నాయకురాళ్లు ఉన్నారు.

Leave a Reply