Globalstar | బుమ్రాపై కామెంట్‌తో ట్రోలింగ్..

Globalstar | బుమ్రాపై కామెంట్‌తో ట్రోలింగ్..

Globalstar | భోపాల్ ఈవెంట్‌లో చరణ్ నోరు జారిండా..?
బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా చెప్పడంతో ట్రోలింగ్
సోషల్ మీడియాలో రామ్ చరణ్ క్లారిటీ

Globalstar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ మూవీ జూన్ 4న భారీ స్థాయిలో వచ్చేందుకు రెడీ అవుతోంది. ముంబాయిలో ట్రైలర్ లాంచ్ చేయగా, భోపాల్లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అయితే.. ఈ వేడుకలో చరణ్‌ నోరు జారడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారినపడ్డాడు. అయితే.. ఆతర్వాత సోషల్ మీడియా ద్వారా చరణ్‌ సారీ చెప్పాడు. ఇంతకీ.. ఏమైంది..?

భోపాల్ లో జరిగిన ఈవెంట్ లో రామ్ చరణ్‌, జాన్వీ కపూర్, ఏ.ఆర్. రెహ్మాన్ పాల్గొన్నారు. ఈ వేడుకలో రామ్ చరణ్‌ తో ర్యాపిడ్ ఫైర్ ఆడించారు. కొంత మంది క్రికెటర్ల పేర్లు ప్రస్తావించి వారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అన్నారు. సచిన్, ధోనీ, కోహ్లి, రోహిత్ శర్మ గురించి ఒక్క లైన్లోనే పొగడ్తలు కురిపించాడు. అయితే.. బుమ్రా గురించి అడిగితే.. అక్కడే తప్పులో కాలేసాడు చరణ్‌. నేను బుమ్రాకు పెద్ద అభిమానిని.. నాకు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. మనదేశంలో ఫుట్ బాల్ ను మరింత ముందుకు తీసుకెళుతున్నారు అని చెప్పాడు.

ఈ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. క్రికెటర్ ని ఫుట్ బాల్ ఆటగాడిగా పేర్కొనడంతో నెట్టింట వైరల్ గా మారింది. ఆఖరికి హోస్ట్ కూడా తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చరణ్‌ సోషల్ మీడియాలో స్పందించాడు. కొన్ని సార్లు పేర్లు విషయంలో కన్ ఫ్యూజ్ అవుతుంటాను. సారీ.. జనం, హడావిడి మధ్య తప్పు దొర్లింది. నిజంగా బుమ్రా ఆటకు వీరాభిమానిని.. అని క్లారిటీ ఇచ్చారు.

CLICK HERE TO READ Movie Release | జన నాయగన్ లైన్ క్లియర్..

CLICK HERE TO READ MORE

Leave a Reply