కాంగ్రెస్ సీనియర్ నేత మృతి.. రత్నవరంలో విషాదం

నడిగూడెం, ఆంధ్రప్రభ ; మండలంలోని రత్నవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పసుపులేటి విష్ణువర్ధన్ (72) ఖమ్మంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ సింగిల్ విండో చైర్మన్ పగడాల ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు పసుపులేటి వినయ్ వర్ధన్, వినయ్ వర్ధన్ రెడ్డి, పగడాల పద్మా ప్రభాకర్ రెడ్డి, మొలుగూరి గురవయ్య, స్థానిక సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ వీర గోవిందు నివాళులర్పించారు.

అలాగే బీఆర్‌ఎస్ నాయకులు పోలంపల్లి వీరబాబు, వెంకన్న, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రవి, గీత కార్మిక సంఘం నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్ట్ ఏనుగుల వీరాంజనేయులు తదితరులు ఆయన మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపారు.

Leave a Reply