నర్సంపేటలో గొర్రె పిల్ల పై వీధి కుక్కల దాడి

నర్సంపేటలో గొర్రె పిల్ల పై వీధి కుక్కల దాడి

  • భయాందోళనలో ప్రజలు
  • నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు!

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ గొర్రె పిల్లపై ఆదివారం ఉదయం దాడి చేసి పీకుతున్న సంఘటన నెలకొంది. వీధి కుక్కల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయనీ 18వ వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల గుంపు ఒక గొర్రెపై దాడి చేసి, దానిని దారుణంగా పీక్కు తింటున్న దృశ్యం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మూగజీవాల ప్రాణాలను బలిగొంటున్న ఈ వీధి కుక్కల సమస్యపై పట్టణ ప్రజలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

18వ వార్డు ప్రజలు, బాధితులు గతంలోనే పలుమార్లు మున్సిపల్ సిబ్బందికి, ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా, నోటిమాటగా ఫిర్యాదులు చేశారు. అయినా మున్సిపల్ అధికారులలో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా ఏదో చూస్తాం అని చెప్పడమే తప్ప, క్షేత్రస్థాయిలో కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు మూగజీవాలు బలిపోతున్నాయి అని స్థానిక వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. దీనికి మున్సిపల్ కమిషనర్ దే పూర్తి బాధ్యత! పట్టణ ప్రజల ప్రాణాలకు, వారి పశువులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత మున్సిపల్ యంత్రాంగానిదే అంటున్నారు. ఇదే కుక్కలు చిన్న పిల్లలపై లేదా వృద్ధులపై దాడి చేసి ప్రాణాలు తీస్తే దానికి పూర్తి బాధ్యత మున్సిపాలిటీ కమిషనరే వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తు న్నారు.

పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు : స్థానిక కౌన్సిలర్ దొమ్మాటి రమ్య సంతోష్

18 వ వార్డులో వీధి కుక్కలు అధికంగా పేరిగిపోయి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని, ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ దొమ్మాటి రమ్య సంతోష్ విచారణ వ్యక్తం చేశారు. ఆదివార ఉదయం గొర్రె పిల్లపై వీధి కుక్కలు దాడి చేసి చంపితిన్నా యని, ఇదే పరిస్థితి రేపటి దినములో పిల్లలకు, వృద్ధులకు ఏర్పడితే దానికి పూర్తి బాధ్యుత కమిషనరే వహించవలసి వస్తుందని హెచ్చరించారు. తక్షణమే 18 వ వార్డులో వీధి కుక్కలను పట్టుకోవాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ కోరారు.

Leave a Reply