టీపీసీసీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా దుర్గారావ్

టీపీసీసీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా దుర్గారావ్

హసన్ పర్తి మే 23(ఆంధ్రప్రభ)

టీపీసీసీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పుల్ల దుర్గారావ్ నియమితులయ్యారు ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్,మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు.హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుర్గారావ్ ఈ పదవికి ఎంపిక కావడంతో స్థానికంగా ఆనందోత్సవాలు వెల్లి విరిచాయి. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి
నిరంతరంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు రాబోయే కార్పోరేషన్, మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయకేతనాన్ని
ఎగుర వేయడానికి శ్రమిస్తానని పేర్కొన్నారు. ఈపదవికి ఎంపిక కావడానికి కృషి చేసిన, ఎమ్మెల్యే సత్యనారాయణ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నమీండ్ల శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు మేరకు దుర్గారావును కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభినందిస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు