మజ్జిగ పంపిణీ చేస్తున్న మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజరెడ్డి
మజ్జిగ పంపిణీ చేస్తున్న మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజరెడ్డి
స్వచ్ఛంద సంస్థల సేవలు ఎనలేనివి
ఎండవేడిమికి పాదాచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ.
మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజరెడ్డి
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : స్వచ్ఛంద సంస్థల సేవలు ఎనలేనివని,ఎండవేడిమికి పాదాచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం పాయకాపురం ప్రాంతంలో వాసవి క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వీఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎండవేడిమికి వాహనదారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎండ తీవ్రంగా ఉన్న నేపద్యంలో పాదాచారులకు,వాహనచోదకులకు మజ్జిగ పంపిణీ చేయడం నిజంగా అభినందనీయమని ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పందిరి బాలసుబ్రహ్మణ్యంని ఆమె అభినందించారు.ఎండ తీవ్రత దృష్ట్యా వాహనచోదకులు మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని
ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నాయకుడు పందిరి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
