ఇందన పొదుపు చర్యలలో భాగంగా బస్సులో కలెక్టర్, జేసీ,అధికారులు..

ఇందన పొదుపు చర్యలలో భాగంగా బస్సులో కలెక్టర్, జేసీ,అధికారులు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లు ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో ని అధికారులందరూ ప్రభుత్వ వాహనాలను వదిలి బస్సులో ప్రయాణించటం విశేషం. జిల్లాలో శనివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ తో పాటు జిల్లాస్థాయి అధికారులు అందరూ బస్సుల్లో ప్రయాణించారు. రాష్ట్రం దేశం ఆర్థిక సంక్షోభం దిశలో నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్క అధికారులు పొదుపు చర్యలు పాటించాలని సూచించారు. ఇందులో భాగంగానే శనివారం ఇలా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల బృందవంత కూడా ఆళ్లగడ్డలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొనటానికి నంద్యాల కలెక్టరేట్ నుంచి పీజీఆర్ఎస్ ఆవరణ నుంచి బస్సులో బయలుదేరారు. జిల్లాస్థాయి అధికారులు సుమారుగా 20 మంది తమ సొంత కార్లలో బయలుదేరి వెళ్తే పెట్రోల్ డీజిల్ వాహన ఖర్చులతో పాటు ప్రభుత్వానికి పెను భారంగా మారుతుందన్నారు. అందుకే పొదుపు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఆళ్లగడ్డకు జిల్లా అధికారుల బృందం అంతా బస్సులో బయలుదేరడం విశేషం.ముఖ్యమంత్రి ఆదేశాలు కనుగొనంగా జిల్లా అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు పొదుపు చర్యలు పాటించాలని సూచించారు.

