వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి

జన్నారం,ఆంధ్రప్రభ : వడదెబ్బ తగిలి మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో ఉట్నూరు మండలం ఘన్పూర్ కు చెందిన ఉపాధి హామీ కూలి కోవ కిరణ్ కుమార్(27) మృతి చెందినట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ శుక్రవారం తెలిపారు. అతను గురువారం ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లి వచ్చి సెల్ ఫోను పనిచేయడం లేదని జన్నారంకు వెళ్లి రిపేరు చేసుకుని వస్తానని చెప్పి వెళ్లాడని మృతుని అన్న కోవ సుంగు మధ్యాహ్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. జన్నారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో చనిపోయి ఉన్న వ్యక్తి తన తమ్మునిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.