గురుకుల బాలికల పాఠశాలకు 100% ఉత్తీర్ణత

కడెం, ఆంధ్రప్రభ : ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో గల తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు శాతం శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్. శకుంతల తెలిపారు.

పాఠశాల నుండి 76 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణులయ్యారు. పది ఫలితాల్లో జీ. సంకీర్తన 564 మార్కులు, పి. గంగాభవాని 560 మార్కులు, బి. సాయి మేఘన 559 మార్కులు సాధించి పాఠశాల టాపర్లుగా నిలిచారు.

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్. శకుంతలతో పాటు స్థానిక గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Leave a Reply