డోంగ్లిలో రేపు రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం
డోంగ్లిలో రేపు రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం
- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి
డోంగ్లి, ఆంధ్రప్రభ:
భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రేపు అనగా 21 తేదీ గురువారం డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నివాళుల కార్యక్రమం నిర్వహించనున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
