states | సైబర్ నేరాలకు సిమ్‌లు సరఫరా చేస్తున్న 66 మంది అరెస్ట్
states | సైబర్ నేరాలకు సిమ్‌లు సరఫరా చేస్తున్న 66 మంది అరెస్ట్
states | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సైబర్ నేరగాళ్లకు అక్రమంగా సిమ్ కార్డులు అందిస్తున్న ముఠాలపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ పేరుతో చేపట్టిన ప్రత్యేక దాడుల్లో 66 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు 13 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఏడు రోజుల పాటు 18 ప్రత్యేక బృందాలతో ఈ ఆపరేషన్ కొనసాగించినట్లు తెలిపారు. సైబర్ మోసాలకు ఉపయోగిస్తున్న భారీ స్థాయిలో ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో మొత్తం 1,194 ఘోస్ట్ సిమ్ కార్డులను పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాలు, అక్రమ మార్గాల్లో సిమ్ కార్డులు తీసుకుని సైబర్ నేరాలకు సరఫరా చేస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
