Mahbubabad | సెక్స్ రాకెట్ గుట్టురట్టు !

Mahbubabad | సెక్స్ రాకెట్ గుట్టురట్టు !

  • న‌గ‌రం నడిబొడ్డున హైటెక్ వ్యభిచారం
  • ఆరుగురు రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్

మహబూబాబాద్, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలో అత్యంత రద్దీ, కీలక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా.. అత్యంత రహస్యంగా నడుపుతున్న హైటెక్ వ్యభిచార స్థావరంపై పోలీసులు శనివారం రాత్రి మెరుపుదాడి చేసి, ‘పత్తిపాక రోడ్ లోని సెక్స్ రాకెట్’ గుట్టును రట్టు చేశారు. ఈ ఆకస్మిక దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన ఆర్గనైజర్‌ (నిర్వాహకురాలితో) పాటు ఐదుగురు మహిళలను పోలీసులు రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు.

Mahbubabad | ఎస్పీకి పక్కా సమాచారం..

పట్టణంలో కొన్ని రోజులుగా వ్యభిచార కార్యకలాపాలు పెరుగుతున్నాయనే ఫిర్యాదులు, విశ్వసనీయ సమాచారం జిల్లా డీఎస్పీ తిరుపతిరావుకు అందినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంపై డీఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే టౌన్​ సీఐ మహేందర్​ రెడ్డికి పక్కా వ్యూహంతో దాడికి దిగాలని ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ ఆదేశాలతో సీఐ బృందం, నెహ్రూ సెంటర్ రోడ్డులోని పత్తిపాక రోడ్ లో ఉన్న ఆ రహస్య వ్యభిచార గృహంపై శనివారం అర్ధరాత్రి దాటాక ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

నిర్వాహకురాలితో పాటు, ఐదుగురు మహిళలు

Mahbubabad

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యభిచార దందా పట్టణం నడిబొడ్డున, జనావాసం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే కొనసాగుతోంది. నిఘా పెట్టి దాడి నిర్వహించిన పోలీసులు, సంఘటనా స్థలం నుంచే ప్రధాన నిర్వాహకురాలు, వ్యభిచారంలో పాల్గొంటున్న ఐదుగురు మహిళలను అరెస్ట్ చేశారు. వీరిలో కొందరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహాన్ని సీజ్ చేసి, వారి నుంచి సెల్‌ఫోన్‌లు, నగదు వంటి కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

పీడీ యాక్ట్ దిశగా దర్యాప్తు

అరెస్ట్ అయిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముఠా వెనుక ఎవరైనా బడా బాబుల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రధాన ఆర్గనైజర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..!

TTD | సతీష్ కుమార్ హత్యపై ఎఫ్ఐఆర్