MLA | స్థానిక కాంట్రాక్టర్లకు అన్యాయం…
MLA | స్థానిక కాంట్రాక్టర్లకు అన్యాయం…
MLA | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం, యంగ్ ఇండియా స్కూల్‌లకు భూమి కేటాయింపుల్లో కోత విధించడంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన భూమిని తగ్గించడంలో ఎమ్మెల్యే సంజయ్ పాత్ర ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
జగిత్యాలలో విద్యాసంస్థల కోసం కేటాయించాల్సిన భూమిని తగ్గించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.
రూ.20వేల కోట్ల విలువైన యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణ కాంట్రాక్టులను మేఘ కృష్ణ రెడ్డికి కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశాలు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
